Site icon NTV Telugu

Chandrababu: విజయవాడ సీఐడీ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu

Chandrababu

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్న చంద్రబాబు నేరుగా ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇసుక పాలసీ కేసుతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, మద్యం పాలసీ కేసులో ఆయన హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read Also: Hari Rama Jogayya: రెండున్నరేళ్లు పవన్‌కళ్యాణ్‌ సీఎంగా ఉండాలి.. హరిరామజోగయ్య లేఖ

ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తు, బాండ్‌ సమర్పించి వెళ్లిపోయారు. అనంతరం ఐఆర్‌ఆర్‌ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయాలకు వెళ్లి చంద్రబాబు పూచీకత్తు, బాండ్లు సమర్పించనున్నారు. విజయవాడ సీఐడీ కార్యాలనియానికి చంద్రబాబు వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు, శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన టీడీపీ అభిమానులకు ఆయన అభివాదం చేశారు.

 

Exit mobile version