Chandrababu: రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రాను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పాతపట్నం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. మే 13కు ప్రజలు సిద్దంగా ఉండాలని.. రాష్ట్రాన్ని బాగుచేయడం కోసం ఈ ఎన్నికలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయన్నారు. పట్టాదారు పాసుపుస్తకం పై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
READ MORE:Kakarla Suresh: ఉదయగిరి కోటపై టీడీపీ జెండా ఎగరవేస్తా.. ఉదయగిరిని సిరులగిరిగా చేస్తా
పాతపట్నం యువత మట్టిలోమాణిక్యాలని.. ఇక్కడ నాణ్యమైన విద్యకోసం కృషి చేస్తానన్నారు.రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. పాతపట్నంలో యువత గంజాయికి బానిసలుగా మరుతున్నారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. వాలంటీర్ లకు రూ.10 వేలు అందజేస్తానని హామీ ఇచ్చారు. వాలంటీర్ కి సిల్క్ డెవెల్ ప్ మెంట్ ద్వారా వారిని మరింత రాటుదేల్చేలా చేస్తామన్నారు. పాతపట్నంను ఆదుకుంటామని..ఇది తాను ఇస్తున్న భరోసా అన్నారు. మనం ఎవరి జోలికి వెళ్లం… వారు మన జోలికి వస్తే సైకిల్ స్పీడు పెంచుతామన్నారు. సాగునీటితోపాటు ఇంటింటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందిస్తామన్నారు. ఫించన్లు ప్రారంభించింది తానే అని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే రూ. 4వేలకు పెంచుతానని స్పష్టం చేశారు. ఇంటి దగ్గరే పింఛన్ వచ్చేలా చేస్తామన్నారు. అన్నా క్యాంటిన్ మరలా తెలుస్తామని భరోసా ఇచ్చారు.