Site icon NTV Telugu

Chandrababu: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ”నన్ను, లోకేష్‌ని కూడా చంపేస్తారట..”

Chandrababu

Chandrababu

Chandrababu: ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..” కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్‌ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు. లండన్ బాబుని శాశ్వతంగా లండన్ పంపిస్తా.. ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోకు అంటూ చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చారని.. కోడి కత్తి డ్రామా ఆడారంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పోలీసుల మెడ మీద కత్తి పెట్టి పని చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా కేసు సుప్రీం కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు వెళ్లడం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. అత్యుత్తమైన ధర్మాసనం చెప్పినా సీఎం నోరు విప్పకుండా ఉన్నారంటే రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ విమర్శలు గుప్పించారు.

మరోసారి ఉన్మాదుల గెలిస్తే అమరావతి, పోలవరం వుండదని ఆయన అన్నారు. నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు.. ఇపుడు ప్రజలు కళ్ళు తెరవాలి.. లేదంటే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం.. నాకు కాదని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రాన్ని మెప్పించి పోలవరంకి అన్ని అనుమతులు తీసుకు వచ్చామంటూ పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన మంత్రికి డయాఫ్రమ్ వాల్ ఎక్కడ వుంటుందో తెలీదంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశాం.. జగన్ సీఎం అయ్యాక రివర్స్ టెండర్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేసారంటూ ఆరోపించారు.

Tiger at Adilabad : రిజర్వాయర్‌ వద్ద కనిపించిన పులి.. టెన్షన్‌.. టెన్షన్‌

పోలవరం నదిలో ముంచేసి నేనే చేశా అంటున్నారు.. పోలవరం పూర్తి చేయలేకపోవడం రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ వ్యాఖ్యానించారు. వాళ్ళు తలచుకుంటే బాబాయిని చంపినట్టు నన్ను చంపేస్తా అంటున్నారట.. వాళ్ల టార్గెట్ ఇపుడు లోకేష్ కూడా అంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌కు పోలీసుల ఉంటే తనకు ప్రజల మద్దతు ఉందని చంద్రబాబు అన్నారు.

 

Exit mobile version