ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి, లోకేశ్ సహా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొననున్నారు. ఇక, చంద్రబాబు జైళ్లోనే ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టనుండగా, ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రి క్యాంప్ ఆఫీసులోనే సత్యమేవ జయతే పేరుతో నిరహార దీక్షకు కూర్చుంటున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేశ్ కూడా అక్కడే ఎంపీ కనకమేడల ఇంట్లో నిరాహార దీక్ష చేయనున్నారు.
Read Also: Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషం సంపాదనతో సామాన్యుడు జీవితాంతం బతికేయొచ్చు
ఇక, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా వారి సతీమణి నారా భువనేశ్వరి సత్యమేవ జయతే పేరుతో నిరహార దీక్ష చేయనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఆమె నిరసన దీక్ష చేయనున్నారు. తొలుత 9.30 గంటలకు రాజమహేంద్రవరం కంబాల చెరువు సమీపంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం నిరసన దీక్ష చేయనున్నారు. ఇక, సాయంత్రం 5 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది.
Read Also: Meenakshi Chaudhary: బంఫర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి.. ఆ హీరో సినిమాలో ఛాన్స్..
చంద్రబాబు కుటుంబం దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేయాలని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని ప్రాంతాల్లో ఒక్కరోజు దీక్ష తెలుగు తమ్ముళ్లు చేయనున్నారు. అయితే, మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి( మంగళవారం) వాయిదా పడింది. జస్టిస్ బట్టి నాట్ బిఫోర్ మి అంశం లేవనెత్తడంతో కేసు విచారణ జస్టిస్ అనిరుధ్, జస్టిస్ త్రివేది బెంచ్‌కు బదిలీ అయింది. ఇంకొవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ అధికారులు నారా లోకేశ్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవాలని