Chandrababu and YS Jagan: వైఎస్ జగన్‌కు చంద్రబాబు ఫోన్
- వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఫోన్
- తన ప్రమాణస్వీకారానికి వైఎస్ జగన్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నం
- జగన్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడేందుకు చంద్రబాబు యత్నం
- ఫోన్ కాల్‌కు అందుబాటులోకి రాని వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and YS Jagan: సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇక, రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది నాల్గోసారి కాగా.. నవ్యాంధ్ర సీఎంగా రెండోసారి.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఇలా ఎందరో ప్రముఖులు తరలిరానున్నారు.. నందమూరి, నారా ఫ్యామిలీలు కూడా సందడి చేయనున్నాయి.. అయితే, ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కూడా ఆహ్వానించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు.. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదట..
Read Also: Schools Reopen: బడికి వేళాయే.. రేపటి నుండి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
తన ప్రమాణస్వీకారానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నం చేశారు.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు టీడీపీ అధినేత.. కానీ, ఫోన్ కాల్‌కు వైఎస్ జగన్ అందుబాటులోకి రానట్టుగా చెబుతున్నారు. కాగా, రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు.. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ రాశారు.. రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా చంద్రబాబుకు లేఖ అందజేశారు గవర్నర్.. ఇక, శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!