ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం జరిగింది. ఈసమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఏపీ మాజీ సీఎం, విపక్ష నేత చంద్రబాబునాయుడు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీతో మాట్లాడారు. సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశం పై టీడీపీ అధినేత చంద్రబాబు ఉపన్యసించారు. చంద్రబాబు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగం లో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు చంద్రబాబు.
ఎన్నాకెన్నాళ్ళకు…
వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ లేదా నంబర్ 2 దేశంగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలం.. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన జరగాలి. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నారు చంద్రబాబునాయుడు. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఆయన ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం బయలుదేరారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జీ 20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్పారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్రపతి భవన్ అశోకా హాల్‌లో జరిగిన సమావేశంలో వివిధ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న జీ 20 సదస్సుకు సంబంధించి సన్నాహక సమావేశం జరిగింది. జీ 20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనల కోసం వివిధ రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించింది కేంద్రం. ఈ సమావేశానికి జగన్ తో పాటు చంద్రబాబు కూడా హాజరయ్యారు.
జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలు తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జి-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన ఈ సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని, అంతర్జాతీయ సమాజం దేశంవైపు చూస్తున్న ఈ సందర్భంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. రాజకీయపార్టీల మధ్య విభేదాలు సహజమని, కాని వాటిని మనవరకే పరిమితం చేసుకుని జి-౨౦ సదస్సు విజయవంతం చేయడానికి అందరూకలిసికట్టుగా ముందుకుసాగాలన్నారు జగన్.
