CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారికి నివాళులు అర్పించారు. గాంధీజీ స్వాతంత్ర్యం కంటే స్వచ్ఛత ముందని చాటిచెప్పారని, కోల్‌కతాలో అపరిశుభ్రమైన మరుగుదొడ్లను ఆయనే స్వయంగా శుభ్రపరిచారని గుర్తుచేశారు. పరిశుభ్రత అనేది ఏ ఒక్క వర్గానికో చెందింది కాదని, ఆరోగ్యం కోసం అందరి బాధ్యత అని తెలిపారు. జపాన్ ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్ బిన్లో వేసే సంస్కృతిని ఉదహరించారు.
ఈ అక్టోబర్ 2న స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని, 22 విభాగాల్లో 130 రాష్ట్రస్థాయి, 2044 జిల్లా స్థాయి అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, పరిశ్రమలతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లను సత్కరిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 12 వేల మంది క్రీడాకారులు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. గత పాలకులు పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టకపోవడంతో రోడ్లపై టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయిందని విమర్శించారు.
Also Read
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నామని, తాను కూడా స్వయంగా పాల్గొంటున్నానని చెప్పారు. ఐదు కోట్ల ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యమన్నారు. స్వచ్ఛత అంటే కేవలం రోడ్లు శుభ్రంగా ఉండటం మాత్రమే కాదని, వ్యక్తిగత శుభ్రత, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెత్తను సమస్యగా కాకుండా సంపద సృష్టించే అవకాశంగా చూస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ కాన్పూర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మధ్య నెట్ జీరో అంశంపై ఎంఓయూ కుదిరింది. వ్యర్థాలను ఎరువులు, బయోగ్యాస్, విద్యుత్‌గా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జీరో గార్బేజ్ సాధన కోసం స్వచ్ఛ రథాలు, ఇ-ఆటోలు, మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ యంత్రాలు, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!