Site icon NTV Telugu

Chandrababu Naidu: కౌలు రైతుల కోసం మేమెంతో చేశాం

Chandrababu

Chandrababu

మార్కాపురంలో అన్నదాతలతో ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రైతులు, కౌలు రైతుల జీవితాలు మార్చేందుకు టీడీపీ ప్రయత్నంలో చాలా చేశాం. యాంత్రీకరణ, సబ్సిడీలు, గిట్టుబాటు ధరల ద్వారా రైతులకు మేలు చేశాం. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిరుధాన్యాలు, ఆక్వా ఉత్పత్తులకు ప్రాధాన్యత పెరిగింది.

పాడి పరిశ్రమకు కూడా డిమాండ్ పెరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తాం.వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకి జగన్ ఉచ్చు బిగించాడు‌.అమరావతికి రైతులు 33 వేల ఎకరాలు భూములు ఇచ్చారు. జగన్ రాజధానికి కులం, మతం, ప్రాంతం రంగుపూసి నాశనం చేశాడు.

Read Also:Sai Dharam Tej: రెండేళ్లు అనుభవించిన నరకానికి దక్కిన ఫలితం.. ఈ విజయం

రైతులకు ఇన్స్యూరెన్స్ విషయంలో వైసీపీ ప్రభుత్వం అబద్దాలు చెప్పింది. నేను నాడు మొదటి సారి అసెంబ్లీలో పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశాను.నేను సమస్యను ప్రస్తావించిన తరువాత ప్రభుత్వం ఇన్స్యూరెన్స్ చెల్లించింది.రైతుల నుంచి వచ్చిన సూచనలను మా మ్యానిఫెస్టో లో పెడతాం.2014లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి రైతుకీ 1.5 లక్షల రుణమాఫీ చేశాం.నేను రైతు బిడ్డను..నాకు రైతు కష్టాలు తెలుసు. వాటిని పరిష్కరిస్తాను అన్నారు చంద్రబాబునాయుడు.

Read Also: Karumuri Nageswara Rao: రాజధాని వైజాగే.. అక్కడి నుండే పాలన..

Exit mobile version