Site icon NTV Telugu

CM Chandrababu: ఆ తల్లి చల్లని చూపు రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి..

Cm Chandrababu Assembly

Cm Chandrababu Assembly

CM Chandrababu: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం.. రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని అందివ్వాలి.. అనునిత్యం పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు, పేదల సేవలో పెన్షన్లు, మహిళామతల్లులకు ఆసరాగా నిలిచే ‘దీపం’, ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’, బిడ్డలను విద్యావంతుల్ని చేసే ‘తల్లికి వందనం’ అమలు చేస్తున్నామని సీఎం గుర్తు చేశారు. రైతుకు అండగా నిలిచే ‘అన్నదాత సుఖీభవ’, పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు నడిపే ‘పీ4’ విధానం, పారిశ్రామిక ప్రగతితో ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూన్నట్లు తెలిపారు.

READ MORE: Off The Record: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నో వేకెన్సీ?

Exit mobile version