Site icon NTV Telugu

CM Chandrababu: నది జలాలపై స్పందించిన సీఎం చంద్రబాబు..!

Chandrababu

Chandrababu

CM Chandrababu Counter: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్ళీ ముదిరింది. నది జలాలపై జరుగుతున్న ఘటనకు సంబంధించి విద్వేషాలు పెంచడం సులభం, కానీ సయోధ్యతో సమస్యలు పరిష్కరించుకోవడమే నిజమైన నాయకత్వం అని చంద్రబాబు అన్నారు.

ONGC Gas: మంటలను వెంటనే అదుపులోకి తీసుకరండి.. గ్యాస్ లీకేజీపై సీఎం ఆరా..!

ఈ సందర్బంగా చంద్రబాబు స్పందిస్తూ.. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సయోధ్య కావాలి. మన మధ్య గొడవలు పెట్టడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు నష్టపోతారు. అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కంటే, కూర్చుని మాట్లాడుకోవడం ద్వారానే పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఏపీ అడ్డుపడుతోందన్న విమర్శలకు చంద్రబాబు కాస్త గట్టిగానే సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు నేను వ్యతిరేకించలేదు. ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని, తెలంగాణ రైతాంగం బాగుపడుతుందని సానుకూలంగా భావించానన్నారు. గోదావరి జలాలను తెలంగాణ వాడుకుంటే నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంలో తప్పులేదన్నారు.

Jolin Tsai: ఓడియమ్మ అనకొండ.. 30 మీటర్ల అనకొండపై పెర్ఫామెన్స్ చేసిన జోలిన్ సాయ్.. వీడియో వైరల్

నీటి పంపకాలపై జరుగుతున్న రాజకీయ పోరును ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏ రాష్ట్ర రైతులైనా మనవాళ్లే.. జల వనరులను సమర్థవంతంగా వాడుకోవడంపై దృష్టి పెట్టాలి తప్ప, రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టకూడదని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

గోదావరి జలాలు వాడుకుంటే నేను ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నీళ్లు వస్తాయని భావించా.. గంగా-కావేరి కలవాలి, దేశం మొత్తం సస్యశ్యామలం అవ్వాలన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సయోధ్య కావాలని, 2047కి తెలుగు జాతి శక్తివంతంగా తయారవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు.

Exit mobile version