CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పేదల సంక్షేమం, అభివృద్ధి, బీసీ రిజర్వేషన్లు, పోలవరం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రం బాగుంటేనే ప్రజలంతా బాగుంటారని అన్నారు. తాను 28వసారి పింఛన్లు పంపిణీ చేస్తున్నానని, కేవలం బటన్ నొక్కడం తన విధానం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి అంటే సచివాలయంలో కూర్చోవడం కాదని, సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నదే తన ఆలోచన అని చంద్రబాబు అన్నారు. నెలకు నాలుగుసార్లు ప్రజల వద్దకు వెళ్తున్నానని తెలిపారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సేవకులమని, పెత్తందారులం కాదని చెప్పారు. ప్రజల నమ్మకమే తన బలమని పేర్కొన్నారు.
ప్రతిపక్షం లేకుండా చేశారంటూ విమర్శలు వస్తున్నాయని, ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం అసెంబ్లీకి కూడా రావడం లేదని చంద్రబాబు అన్నారు. ప్రజలే తమకు ప్రతిపక్షమని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో కూటమి గ్రాఫ్ పెరుగుతున్నట్లు వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. గత పాలకులు అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించి, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందన్నారు. పేదరికాన్ని మానవీయ కోణంలో చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన ప్రధానిగా నరేంద్ర మోcw ఉన్నారని అన్నారు. పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన భూమిని ఇచ్చామని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళ గతంలో ఇటుక బట్టీలో కూలీగా పనిచేసేదని, శిక్షణ పొంది ప్రస్తుతం ఇటుక బట్టీ నిర్వహిస్తూ ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం పొందుతున్నారని చెప్పారు. ఇలాంటి ‘జేజమ్మ’ సక్సెస్ స్టోరీలను చూడాలనుకుంటున్నానని, ఆమె ఇంటికి వెళ్లనున్నట్లు తెలిపారు.
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
గత ప్రభుత్వం రోడ్లపై గుంతలు తీస్తే తాను వాటిని పూడ్చానని చంద్రబాబు అన్నారు. ఇకపై గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. గతంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీకి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. రేపల్లె రైల్వే లైన్‌ను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తవుతుందని రేపల్లెలో హామీ ఇస్తున్నానని చంద్రబాబు అన్నారు. వచ్చే ఏడాదికి పోలవరం ఫేజ్-1 పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తామని చెప్పారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బాపట్లకు సూర్యలంక దేవుడిచ్చిన వరమని, దాన్ని గోవా కంటే మిన్నగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో నిలిపే బాధ్యత ప్రజాప్రతినిధులదని, సహకరించే బాధ్యత తనదని అన్నారు. ప్రతిపక్షానికి పోటీ తత్వం ఉండాలని, అయితే ప్రస్తుత ప్రతిపక్షానికి కుట్రతత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. ‘గొడ్డలి పార్టీ’కి భయపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ కలిసి పనిచేస్తున్నామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?