Site icon NTV Telugu

రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు.. వీటిపైనే ఫిర్యాదు !

ఢిల్లీః రాష్ట్ర పతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ను టీడీపీ అధినేత ఎన్. చంద్ర బాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతి కి అందజేశారు చంద్రబాబు. ఏపీ లో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని… రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు చంద్రబాబు..

అలాగే… .అక్టోబర్ 19 న జరిగిన ఘటనల పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అధికారపార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీ నీ రీకాల్ చేయాలని రాష్ట్రపతిని కోరారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ లో లిక్కర్ ,డ్రగ్స్ మైనింగ్, సాండ్, మాఫియా విస్తరించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు చంద్రబాబు. న్యాయ, మీడియా తో సహ అన్ని వ్యవస్థల పైన దాడులు జరుగుతున్నాయని.. రాష్ట్రపతి ని టీడీపీ బృందం తరపున నాలుగు ప్రధాన డిమాండ్స్ కోరామని వివరించారు. తమ డిమాండ్ల రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు.

——

Exit mobile version