Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు

Cbn

Cbn

Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. నేడు సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్నారు చంద్రబాబు.. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈరోజు, రేపు (అక్టోబర్ 8) కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం తదితర అంశాలపై ఈ భేటీల్లో చర్చించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, రేపు మధ్యాహ్నం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉండనుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు రేపు రాత్రి 8 గంటలకు తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో జరిగే వరుస భేటీలపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. కేబినెట్‌ ముందు కీలక అజెండా ఉండగా.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నిలుపై కూడా చర్చించనున్నారు..