Site icon NTV Telugu

Chandrababu Case: హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లోనూ చంద్రబాబు కేసులో విచారణ..

Chandrababu

Chandrababu

Chandrababu Case: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌తో మాజీ మంత్రి నారాయణ, ఆయన బావమరిది పిటిషన్లపై.. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన కేసుపై విచారణ జరగనుంది.. IRR కేసు, అంగళ్ల కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది.. ఇక, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో విచారణకు రావాలని సీఐడీ ఇచ్చిన నోటీసులు క్వాష్ చేయాలంటూ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది.. మరోవైపు.. IRR కేసులో మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవులు ముని శంకర్ ముందస్తు బెయిల్ పై కూడా విచారణ జరగనుంది..

Read Also: Electric Buses: నగరానికి మరో వెయ్యి విద్యుత్‌ బస్సులు.. చార్జీలు చాలా తక్కువ..

ఇక, విజయవాడలోని ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్ల మీద ఈ రోజు విచారణ జరగనుంది.. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో గత నెల 9వ తేదీన అరెస్ట్‌ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ్టితో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు రిమాండ్ 33వ రోజుకు చేరింది.. ఈ నెల 19వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించిన విషయం విదితమే. ఇక, చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం విదితమే.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.. తనపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని పేర్కొంటూ క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

Exit mobile version