Site icon NTV Telugu

Chandra Mohan Died: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత!

Chandra Mohan Died

Chandra Mohan Died

Tollywood Senior Actor Chandra Mohan Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, కథనాయకుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో శనివారం ఉదయం 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న చంద్రమోహన్‌.. కొన్నాళ్లుగా కిడ్నీ డయాలసిస్‌ జరుగుతోంది.

1945 మే 23న క్రిష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో చంద్రమోహన్‌ జన్మించారు. చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. 1966లో రంగుల రాట్నం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. హీరోగా 175 సినిమాలు చేసిన ఆయన మొత్తంగా 932 సినిమాలు చేశారు. 2005లో అతనొక్కడే సినిమాకు గాను నంది అవార్డు ఆయనకు దక్కింది. కథనాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా వైవిధ్య పాత్రలు చంద్రమోహన్‌ చేశారు. రెండు ఫిలింఫేర్‌, 6 నంది అవార్డులను ఆయన అందుకున్నారు.

 

Exit mobile version