Chandra Babu: బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో జరిపిన మాటలలో పలు వ్యాఖ్యలు చేసారు సీఎం చంద్రబాబు. ఎవరిపైనా రాజకీయంగా నిలదీసే స్వభావం లేదని, అలా చేసిన వారెవరూ తప్పించుకోలేరని, తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువగా బాధపడ్డది నేనేనని.. గత ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారని., జైలులో నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ప్రచారం కూడా జరిగిందని మాట్లాడారు. ఈ సమయంలో జైలు మీదుగా డ్రోన్లు కూడా ఎగరేశారని., జైలులో నా గదిలో నిఘా కెమెరాలు పెట్టారని., వాటిని చూసి నేనే తొలిగించామన్నాని చెప్పనట్లు తెలిపాడు. జైలులో ఉన్న సమయంలో కనీసం వేడినీళ్లు కూడా ఇవ్వలేదని., నన్ను చిత్రహింసలకు గురిచేయడాని, ఎప్పుడు నాకు చల్లటి నీరు ఇచ్చేవారని.. దోమలు కుడితే… కనీసం దోమతెర కూడా ఇవ్వలేదని వాపోయారు.
Nitish Kumar Reddy: రెండో మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సృష్టించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి
ఈ సందర్బంగా మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీలో పార్టీ ప్రజాప్రతినిధుల జోక్యాన్ని సహించేది లేదని, బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “రాజకీయ పాలన” అంటే ప్రజలకు, కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడమేనని, కర్ర చేతబట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం కాదని వివరించారు. మద్యం వేలం పాటలలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు మద్యం దుకాణాల గడువును పొడిగించినట్లు తెలిపారు.