NTV Telugu Site icon

Chandini Chowdary: ఏంటి చాందిని అలా కుదిరిందా.. లేదా సెట్ చేసుకున్నావా.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్..

Chandini Chowdary

Chandini Chowdary

తెలుగు నటి చాందిని చౌదరి ఇదివరకు షార్ట్ ఫిలిమ్స్ లో మంచి పేరును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా లేడీ ఒరింటెడ్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ హిట్ లను కొట్టేస్తుంది. ఇదివరకే హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాతో హిట్టును సొంతం చేసుకున్న చాందిని అతి త్వరలో రాబోయే మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాలలో చాందిని చౌదరి లీడ్ రూల్స్ లో నటించింది. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా ఒకేరోజు విడుదల అవ్వడం.

Kidney Stone: ఈ నియమాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు తొలగేలా చేయండి

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఇదివరకే చాలాసార్లు వాయిదా పడి చివరికి జూన్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే తాజాగా యేవమ్.. సినిమా కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా బృందం తెలియజేసింది. ఈ రెండు సినిమాలు కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే. ఇక యేవమ్ సినిమాలో చాందిని ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. ఇదివరకే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది.

INDIA Bloc: ఎగ్జిట్ పోల్స్‌ చర్చల్లో పాల్గొంటాం

ఇప్పటివరకు ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు వేరువేరు సినిమాలు ఒకే రోజు లేదా మరుసటి రోజు వచ్చాయా ఏమో కానీ.. ఓకే హీరోయిన్ ఉన్న సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం మాత్రం ఇదే మొదటిసారి. అయితే ఇలా రిలీజ్ కావడానికి చాందిని ఒప్పుకుందా లేదా సినిమా నిర్మాతలు ఒప్పించారా అనే విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. చూడాలి మరి రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ డేట్ ఫిక్స్ అవడంతో చివరికి ఏ సినిమా రిలీజ్ అవుతుందో.. ఏ సినిమా వాయిదా పడుతుందో.. వేచి చూడాల్సిందే. ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం చాందిని రెండు సినిమాల ప్రమోషన్స్ కి చాలా కష్టపడాల్సిందే.

Show comments