NTV Telugu Site icon

Live Suicide : వాటర్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి.. వీడియో వైరల్..

Live Sucide

Live Sucide

Live Suicide Caught on Camera: పంజాబ్‌ లోని చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి ఖరార్ లో వాటర్ ట్యాంక్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని 19 ఏళ్ల సుమిత్ చక్రగా గుర్తించారు. హర్యానా నివాసి అయిన ఆయన చదువుకోవడానికి ఖరార్ లో ఉంటున్నాడు. ఈ సంఘటనలో 19 ఏళ్ల సుమిత్ అకస్మాత్తుగా ఖరార్లోని ఖాన్పూర్ గ్రామానికి సమీపంలో ఒక వాటర్ ట్యాంక్ ఎక్కాడు. అతను చండీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చాడు. కానీ., ఆర్థిక విషయాల కారణంగా అతను చాలా డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

UP News: నేడు యూపీలో ‘పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ‘..36.50కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం

అతను ట్యాంక్ ఎక్కడం చూసిన వెంటనే అతని స్నేహితులు, పొరుగువారు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని ఆపడానికి ట్యాంక్ పైకి ఎక్కారు. కాని., వారు ఎక్కడం చూసి సుమిత్ ట్యాంక్ నుండి దూకి తన జీవితాన్ని ముగించాడు. వాటర్ ట్యాంక్ ఎక్కడానికి ముందు అతను తన చేతి మణికట్టును కత్తిరించడానికి కూడా ప్రయత్నించాడు. కానీ., అతను ఆ గండం నుండి బయట పడ్డాడు. దాంతో ట్యాంక్ ఎక్కి ఎత్తు నుండి పడి ఆత్మహత్య చేసుకోవడం అతనికి సులువుగా భావించి ఆ పని చేసాడు.

SIT: సిట్ మూవీకి ఆ రేటింగ్స్ లో టాప్ 4 ప్లేస్

సుమిత్ కుటుంబంలో ఏకైక కుమారుడని, అతను హర్యానా నివాసి అని సుమిత్ గురించి సమాచారం పంచుకుంటూ స్నేహితులు పోలీసులకు చెప్పారు. ఆ కుటుంబం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ భారాన్ని భరించలేనందున అతడు ఇలా చేసాడని వారు తెలిపారు. సుమిత్ మరణంతో అతని తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోయారు.

Show comments