NTV Telugu Site icon

SBI SCO Recruitment 2025 : ఈ అర్హతలున్నాయా? ఎస్బీఐలో ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్.. నెలకు రూ. 93 వేల జీతం

Sbi

Sbi

SBI SCO Recruitment 2025 : బ్యాంక్ జాబ్ ను తమ డ్రీమ్ జాబ్ గా పెట్టుకుంటుంటారు యూత్. బ్యాంక్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తుంటారు. కోచింగ్ తీసుకుని ఏళ్ల తరబడి సన్నద్ధమవుతుంటారు. ఎప్పుడెప్పుడు బ్యాంకుల నుంచి జాబ్ నోటిఫికేషన్ వస్తుందా? అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ కావాలని చూస్తున్నారా? బ్యాంకిగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్ ఇటీవల ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Read Also:CM Revanth Reddy: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం..

ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. అంటే మీరు ఈజీగా జాజ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 93 వేల వరకు జీతం అందుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఎలా ఎంపిక చేస్తారు? ఆ వివరాలు మీకోసం.. ఎస్బీఐ రెగ్యులర్ ప్రాతిపదికన 150 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్ తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

Read Also:Kerala: ఐఏఎస్ హిందూ-ముస్లిం వాట్సప్ గ్రూప్‌పై దుమారం.. కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే..!

అభ్యర్థుల వయసు 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్/EWS/OBC అభ్యర్థులకు రూ. 750 గా నిర్ణయించారు. SC/ ST/ PwD అభ్యర్థులకు ఫీజునుంచి మినహాయింపునిచ్చారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం sbi.co.inను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు మళ్లీ రాని ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.

Show comments