Site icon NTV Telugu

Champion: రోషన్–నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఫన్నీ చిట్‌చాట్.. ‘ఛాంపియన్’ ప్రమోషన్ వీడియో వైరల్

Champion

Champion

Champion: టాలీవుడ్ యంగ్ హీరో మేకా రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, మూవీ టీమ్ తాజాగా ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రోషన్ మేకా, భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. నితీష్, రోషన్‌కు సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలుపగా.. రోషన్ కూడా నితీష్ క్రికెట్ కెరీర్‌కు అభినందనలు తెలిపాడు. “నీ మూవీకి కాంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్” అని నితీష్ చెప్పగా.. సినిమా డిసెంబర్ 24న అమెరికాలో ప్రీమియర్స్, 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ అవుతుందని రోషన్ తెలిపాడు. దీనితో నితీష్ సినిమాను కచ్చితంగా చూస్తానన్నాడు.

ICC Rankings: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలిసారిగా వరల్డ్ నెం.1 కైవసం..!

రియల్ లైఫ్ ఛాంపియన్ ఎవరు?
సంభాషణలో భాగంగా నితీష్ అడిగిన “ఛాంపియన్ అంటే ఎవరు?” అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. దీనికి రోషన్, “నా రియల్ లైఫ్‌లో నా నాన్న, అమ్మనే నా ఛాంపియన్స్” అని సమాధానం చెప్పాడు. దీనికి నితీష్ కూడా ఏకీభవిస్తూ.. “నా డాడ్ నా కోసం చాలా త్యాగాలు చేశారు” అని స్పందించాడు.

ఫేవరెట్ క్రికెటర్, ఐపీఎల్ టీమ్..
ఆ తర్వాత నితీష్ రోషన్ ను అడిగిన “నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు?” అనే ప్రశ్నకు ఎంఎస్ ధోని అని సమాధానమిచ్చాడు. దీనికి నితీష్ కూడా మేము కూడా “స్టాండ్స్ నుంచి చూస్తున్నప్పటికీ, అతను ఫీల్డ్ సెట్ చేసే విధానం, మైండ్‌తో ఆటను నడిపే తీరు నాకు చాలా ఇష్టం” అని వివరించాడు. అలాగే ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి.. హైదరాబాద్ నుంచి వచ్చిన నితీష్ రోషన్ ను ఏ టీమ్‌కు సపోర్ట్ చేస్తావని అడగగా.. “ధోని కారణంగా…” అంటూ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 42.74 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు..

ఫేవరెట్ యాక్టర్లు, హీరోయిన్లు..
సినిమా టాపిక్‌కు మళ్లిన ఈ చిట్‌చాట్‌లో నితీష్ తన ఫేవరెట్ యాక్టర్‌గా మహేష్ బాబు పేరును వెల్లడించాడు. రోషన్ మాత్రం తనకు నచ్చిన హీరో పేరు చెప్పలేనని.. “అలా చెప్పకూడదు అంటూ సరదాగా నవ్వాడు. ఇక ఇష్టమైన హీరోయిన్ల విషయానికి వస్తూ.. రోషన్ తనకు సమంత ఇస్తామని తెలుపగా, నితీష్ మాత్రం కాజల్ అగర్వాల్ ఫేవరెట్స్‌గా చెప్పుకొచ్చారు. ఇక చివర్లో రోషన్, “నా టీమ్‌ను నీ మూవీకి తీసుకువెళ్తాను” అంటూ నితీష్‌ చెప్పగా.. దానికి రోషన్ “థ్యాంక్ యూ సో మచ్” అంటూ స్పందించాడు.

Exit mobile version