Champion : ఛాంపియన్ ఓటీటీ డీల్ క్లోజ్..?
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందD’ సినిమాలతో యూత్ పల్స్ పట్టుకున్న రోషన్, సరైన హిట్ అందుకోనప్పటికి మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకున్నాడు. దీంతో ఈసారి ఎలా అయిన గట్టి హిట్ కొట్టాలొ అని.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ అనే భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడు. 1940వ దశకం నాటి హైదరాబాద్ నేపథ్యంతో, ఫుట్‌బాల్ క్రీడను ముడిపెట్టి రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, మిక్కీ జె మేయర్ తనదైన శైలిలో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం..
Also Read : Virender Sehwag : రిటైర్మెంట్ తర్వాత తెలుగు సినిమాలే నా లోకం: వీరేంద్ర సెహ్వాగ్
Also Read
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
- Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
- Grok's Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాతే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం, ట్రైలర్‌కు లభించిన అద్భుతమైన స్పందన కారణంగానే ఈ స్థాయి బిజినెస్ జరిగినట్లు సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పవర్‌ఫుల్ ఎమోషనల్ కథ, రోషన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!