Site icon NTV Telugu

Champion : ఓటీటీ డీల్ ముగించుకున్న ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Roshan Champion

Roshan Champion

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందD’ సినిమాలతో యూత్ పల్స్ పట్టుకున్న రోషన్, సరైన హిట్ అందుకోనప్పటికి మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకున్నాడు. దీంతో ఈసారి ఎలా అయిన గట్టి హిట్ కొట్టాలొ అని.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ అనే భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడు. 1940వ దశకం నాటి హైదరాబాద్ నేపథ్యంతో, ఫుట్‌బాల్ క్రీడను ముడిపెట్టి రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, మిక్కీ జె మేయర్ తనదైన శైలిలో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం..

Also Read : Virender Sehwag : రిటైర్మెంట్ తర్వాత తెలుగు సినిమాలే నా లోకం: వీరేంద్ర సెహ్వాగ్

ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాతే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం, ట్రైలర్‌కు లభించిన అద్భుతమైన స్పందన కారణంగానే ఈ స్థాయి బిజినెస్ జరిగినట్లు సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పవర్‌ఫుల్ ఎమోషనల్ కథ, రోషన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version