Site icon NTV Telugu

Champion : ‘ఛాంపియన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రోషన్–అనస్వర కెమిస్ట్రీ హైలైట్!

Champion First Song Out

Champion First Song Out

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న ‘ఛాంపియన్’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో, ఎమోషన్స్‌తో, స్పోర్ట్స్ టచ్‌తో సినిమా ఉంటుందని టీమ్ ముందే చెప్పేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘గిర గిర గింగిరానివే’ రిలీజ్ చేశారు. అంతే కాదు ఈ మూవీని డిసెంబర్ 25న విడుదల కాబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు.  ఇక పాట బయటకు వచ్చిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. శ్యామ్ కాసర్ల రాసిన లిరిక్స్ యూత్‌ఫుల్‌గా ఉండగా, రామ్ మిరియాల గాత్రం పాటకు మంచి ఫ్లో తెచ్చింది.

Also Read : Ram Gopal Varma : నేను కూడా పైరసీ చూస్తా – ఆర్జీవీ షాకింగ్ స్టేట్‌మెంట్ వైరల్ !

అసలు ఈ సాంగ్ ప్రోమోతోనే మంచి బజ్ క్రియేట్ కాగా.. స్పెషల్ ఏమిటంటే రోషన్ – అనస్వర మధ్య కెమిస్ట్రీ అంత హైలెట్ అవుతుంది. స్క్రీన్ మీద ఇద్దరి ఎక్స్‌ప్రెషన్స్, క్యూట్ మోమెంట్స్ పాట మొత్తం హైలైట్‌గా నిలుస్తున్నాయి. రోషన్ ఈ సినిమాతో తన లుక్, బాడీ లాంగ్వేజ్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. అనస్వర రాజన్ యూత్‌కి నచ్చే ఫ్రెష్ ఎనర్జీని తెచ్చి పెట్టింది. పాట‌లోని లొకేషన్స్, కలర్‌ఫుల్ ఫ్రేమ్స్, మ్యూజిక్ సెట్టింగ్స్ చూస్తుంటే సినిమా టోన్ కూడా ఎలా ఉంటుందో క్లారిటీగా అర్ధం అవుతుంది. సినిమాలో రొమాన్స్, స్పోర్ట్స్, ఎమోషన్స్ అని బ్యాలెన్స్ గా ఉంటాయని టీమ్ హింట్ ఇస్తోంది. మొత్తంగా ‘గిర గిర గింగిరానివే’ సాంగ్‌తో ‘ఛాంపియన్’ మూవీ ప్రమోషన్స్‌కి మంచి ప్రారంభం అయ్యింది. యూత్ లో ఇదే సాంగ్ కొన్ని రోజులు రిపీట్ మోడ్‌లో ఉండడం పక్కా!

 

Exit mobile version