Site icon NTV Telugu

Jharkhand: నేడు జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి పయనం..

Champai Soren

Champai Soren

జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో బస చేశారు. ఇక, చంపయ్‌ సోరెన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు రిసార్టులో బస చేసిన దాదాపు 40 మంది ఎమెల్యేలు రాంచీకి చేరుకున్నారు. మొత్తం 81 మంది సభ్యులు ఉండే ఆ రాష్ట్ర అసెంబ్లీలో.. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్‌(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉండగా.. సీపీఐ(ఎంఎల్‌)కు ఒక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి సపోర్టు ఇస్తుంది. అయితే, బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read Also: Tobacco : పాన్ మసాలా, గుట్కా, పొగాకు కంపెనీలకు షాక్.. ఈ పని చేయకపోతే రూ.లక్ష జరిమానా

ఈ బల పరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు రావాలి.. సంఖ్యాపరంగా ఆ కూటమికి బలపరీక్షలో నెగ్గే బలం ఉంది అయిన్నప్పటికీ.. పరిస్థితి అంత సజావుగా ఏమీ సాగడం లేదు.. సీనియర్‌ ఎమ్మెల్యే లాబిన్‌ హెమ్‌బ్రామ్‌ ఈ బలపరీక్షలో ఓటు వేయడానికి పలు డిమాండ్లను పార్టీ చీఫ్‌ శిబు సోరెన్‌ ముందు పెట్టారు. మద్య నిషేధం, అటవీ సంరక్షణకు, నీటి సంరక్షణకు కఠినమైన చట్టాల్లాంటి 2019 ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విష్ణుపూర్‌ ఎమ్మెల్యే చమ్రాలిండా ఇటీవల జేఎంఎం నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టాడు.

Read Also: IAS Officers Transfer: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు..

అయితే, విష్ణుపూర్‌ ఎమ్మెల్యే అనారోగ్యం బారిన పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చమ్రాలిండా ఎవరికీ అందుబాటులో లేకూండా పోయినట్లు తెలుస్తుంది. ఇక, నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ఆయన గైర్హాజరయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే, హైదరాబాద్‌లోని రిసార్ట్‌కు 40 మంది ఎమ్మెల్యేలు రాగా.. వీరిద్దరినీ కలిపితే 42 మంది. మిగతా నలుగురి గురించి తెలియదు. జేఎంఎం వర్గాలు మాత్రం.. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకొస్తున్నారు. కాగా.. ఇవాళ పరీక్షలో హేమంత్‌ సోరెన్‌ ఓటు వేసేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు పర్మిషన్ ఇచ్చింది.

Exit mobile version