Site icon NTV Telugu

Jharkhand : జార్ఖండ్ లో బల పరీక్ష.. విజయం సాధించిన చంపై సర్కార్..

Champai

Champai

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెర పడింది. జార్ఖండ్‌ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపై సోరెన్‌ సర్కార్ విజయం సాధించింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస పరీక్షలో జార్ఖండ్ సర్కార్ నెగ్గింది. అంతకు ముందు శాసనసభలో చంపై సోరెన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. ఇందులో 47 మంది చంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.

Read Also: Hemant Soren: నా అరెస్ట్‌లో రాజ్‌భవన్ పాత్ర ఉంది.. అసెంబ్లీలో నేను కన్నీళ్లు పెట్టుకోను..

అయితే, అంతకు ముందు జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఒక సీఎంను రాత్రి వేళ అరెస్టు చేశారన్నారు. ఈ ఘటనలో రాజ్‌భవన్‌ పాత్ర కూడా ఉందని తాను నమ్ముతానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దేశ చరిత్రలో జనవరి 31ని బ్లాక్​ డేగా సోరెన్ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని నన్ను అరెస్ట్ చేసింది అని బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో హేమంత్ సోరెన్ ఆరోపించారు.

Exit mobile version