ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది..అందులో కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ విడుదలకు రెడీ అవుతుంది.. మన దేశ సంగీత చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలకు లిఖించుకున్న ప్రముఖ గాయకుడు అమర్ సింగ్ చమ్కీలా జీవితానికి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్ ఉంది. ‘చమ్కీలా’ పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తెరకెక్కింది.. ఆ సినిమా రిలీజ్ కాబోతుంది..
డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) వర్గానికి చెందిన కుటుంబంలో 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్ కాగా సంగీత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అమర్ సింగ్ చమ్కీలాగా పేరు మార్చుకున్నాడు.. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నో కష్టాలను ఎదుర్కోని దుస్తుల మిల్లులో పనిచేసిన ఆయన ఓ స్నేహితుడి వల్ల భారతదేశాన్నే ఊపేసే సింగర్‌గా చరిత్రకెక్కాడు. ఆ రోజుల్లో చమ్కీలా పాటకు ప్రభుత్వాలే కూలిపోయేలా ఉండేవి. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు.. అలా చాలా ప్రదక్షణలు కూడా ఇచ్చాడు..
ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకేక్కింది.. దిల్జిత్ దోసాంజ్, పరిణీతి చోప్రా జోడీగా ‘చమ్కిలా’ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా పంజాబ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న చమ్కిలా సినిమా విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చెయ్యనున్నట్లు సమాచారం..
