NTV Telugu Site icon

Chamala Kiran Kumar Reddy : బూర నర్సయ్య గౌడ్ కులం, మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుండు..

Chamala Kiran Kumar Reddy

Chamala Kiran Kumar Reddy

నేను రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసి ఉంటే నాకు కాంగ్రెస్ బి పామ్ ఇస్తుందా….? అని యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బూర నర్సయ్య గౌడ్ ఎంపీ గా ఉన్న సమయంలో తెచ్చిన నిధుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎందుకు కనిపించడం లేదని ఆయన అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బూర నర్సయ్య గౌడ్ కులం, మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుండని, 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్ వచ్చిందన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. డాక్టర్ గా ఉండి కూడా… ఎయిమ్స్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు బుర నర్సయ్య గౌడ్ అని ఆయన అన్నారు.

అంతేకాకుండా.. ‘బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా ఉండి ఎన్నిసార్లు ప్రధాన మంత్రి కలిశారు. కులమతాలకు అతీతంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పనిచేస్తారు.. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే నన్ను ఎంపీ గా గెలిపించండి… మోడీ పదేళ్లు పాలనలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది.. తెలంగాణలో కేసీఆర్ ప్రజల సొమ్మును దొచ్చుకుంటే మోడీ ప్రభుత్వం ఏమి చేసింది..? కేసీఆర్ తెలంగాణ నిధులు కావాలని మోడీని అడిగిన దక్కాలు లేవు… బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులకు భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదు.. చేనేత కార్మికులకు జిఎస్టి వేసి వాళ్ళును బ్రతకాకుండా చేశారు.. రష్యా ,చైనా దేశాలలో ప్రధాన మంత్రుల రాజ్యాంగం మార్చి పర్మినెంట్ ప్రధానమంత్రి ఉండాలని మోడీ చూస్తుండు’ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి.