AP: ఇవాళ చలో విజయవాడ మహాధర్నా యథాతథంగా కొనసాగుతుందని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ యాజమాన్యం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నాట్లు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా సాగనుంది. రూ.2700 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆషా డిమాండ్ చేస్తోంది.. ప్రభుత్వం విడుదల చేసిన రూ. 250 కోట్లతో సరిపెట్టుకోలేం అంటున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్.. పూర్తి బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగుతుందంటూ పేర్కొన్నాయి. గత 14 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పటల్స్ బకాయిల విడుదల కోసం ఆందోళన చేపడుతున్నాయి. వైద్య సేవలు నెట్వర్క్ హాస్పటల్స్‌లో 14 రోజులుగా ఉచిత సేవలు నిలిచిపోయి. సామాన్య ప్రజలకు ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాధర్నాను IMA, APNA, AP JUDA 2 AP GOVERNMENT DOCTORS ASSOCIATION ప్రతినిధులు బలపర్చనున్నారు.
READ MORE: Renu-desai : ఈసారి కామెడీని నమ్ముకున్న రేణు దేశాయ్..?
కాగా.. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (నెట్‌వర్క్) కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనుబంధ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల్లో భాగంగా ప్రభుత్వం రూ. 250 కోట్లను విడుదల చేసింది. నిధుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో జరిపిన చర్చల అనంతరం ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అలాగే, త్వరలోనే మరో రూ. 250 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే వైద్య సేవలను కొనసాగించాలని, అలాగే ఆందోళన విరమించాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఆసోసియేషన్ (AASHA), ఇతర సంఘాల ప్రతినిధులను ఆయన కోరారు. బుధవారం తనను కలిసిన పలువురికి ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలను సౌరభ్ గౌర్ ఈ సందర్భంగా వివరించారు.
READ MORE: Tollywood Hero : ప్లాప్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో
