NTV Telugu Site icon

Penamaluru: పెనమలూరు పంచాయితీ.. చంద్రబాబు, లోకేష్‌పై దేవినేని స్మిత ఫైర్‌

Penamaluru

Penamaluru

Penamaluru: పెనమలూరు సీటుపై ఉత్కంఠకు తెరదించుతూ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ను అభ్యర్థిగా ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. అయితే.. ఇప్పుడు పెనమలూరు టీడీపీ సీటు విషయంలో కొత్త పంచాయితీ స్టార్ట్ అయ్యింది.. బోడె ప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వడంపై చలసాని పండు (వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. బోడె ప్రసాద్‌కు సీటు కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన స్మిత.. చంద్రబాబు, లోకేష్ పై ఫైర్‌ అయ్యారు.. చంద్రబాబు, లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారన్నారు. 2009లో మా తండ్రి ఓటమికి పార్టీనే కారణం అని ఆరోపించారు. సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారని.. నాతండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారు.. నా మామగారు చనిపోయిన బాధలో ఉన్నా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టాం అన్నారు.

Read Also: AAP: ఈడీ జేపీ నడ్డాను అరెస్టు చేయాలంటూ ఆప్ డిమాండ్

ఇక, 2014లోనూ టిక్కెట్ మాకు ఇవ్వలేదు.. 2019లోనూ మాకు టిక్కెట్ ఇవ్వలేదు.. కానీ, ఈ సారి టిక్కెట్ ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు దేవినేని స్మిత.. దీంతో.. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేశా.. బోడె ప్రసాద్ కు ఏరకంగా సీటు ఇస్తారు? అని నిలదీశారు. టిక్కెట్ లేదంటే బోడె ప్రసాద్‌ ఏడ్చాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు.. మేం బోడె ప్రసాద్‌లా చేయలేదు కదా..? మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. బోడె ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టిక్కెట్లిస్తారా? అంటూ మండిపడ్డారు చలసాని పండు (వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత.

Show comments