Pavitranath : మొగలి రేకులు సీరియల్ ఫేమ్ దయ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pavitranath : బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ అంటే కచ్చితంగా గుర్తుకు వచ్చేవి చక్రవాకం, మొగలిరేకులు. ఈ రెండు సీరియల్స్ బుల్లితెరను కొన్ని సంవత్సరాల పాటు శాసించాయి. ఇక సీరియల్‌లో నటించిన నటీనటులను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయ ఇలా అన్ని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ఇప్పటికీ వారంతా ఓ ఫ్యామిలీలానే ఉంటారు. ఈ క్రమంలో ఓ చేదువార్త వెలుగులోకి వచ్చింది. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌లో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.
Read Also:Hyderabad High Alert: బెంగుళూరులో పేలుళ్లు.. హైదరాబాద్ లో హై అలర్ట్..
Also Read
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌లో ఇంద్రనీల్ తమ్ముడి పాత్రలో నటించి.. ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నారు పవిత్రనాథ్. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘‘పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం.. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం.. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి’’ అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.
Read Also:Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. మార్చి నుంచే వడగాడ్పులు!
ఇక మేఘన, ఇంద్రనీల్ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. అసలేం జరిగింది.. దయ చనిపోవడం ఏంటి.. ఇదంతా ఎప్పుడు జరిగింది.. ఎందుకు ఎలా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక గతంలో పవిత్రనాథ్‌పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే ఇంటికి వారిని తీసుకువచ్చేవాడని.. దీని గురించి ప్రశ్నిస్తే.. తనను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత ‘స్వర్ణం’ కైవసం.!
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?