Site icon NTV Telugu

CHAKRASIDDH : డా. భువనగిరి సత్య సింధుజ, చక్రసిద్ధ్ రీసెర్చ్ సెంటర్‌కు అంతర్జాతీయ అవార్డులు

Sinduja

Sinduja

CHAKRASIDDH : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సిద్ధ వైద్యురాలు డా. భువనగిరి సత్య సింధుజ, ఆమె స్థాపించిన చక్రసిద్ధ్ హోలిస్టిక్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు. సింగపూర్‌లో జరిగిన “ది ఇంటర్నేషనల్ అవార్డ్స్ సమ్మిట్ 2025″లో వీరు ఈ పురస్కారాలను అందుకున్నారు. 36వ తరం సిద్ధ వైద్యురాలుగా, 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది మంది రోగులకు చికిత్స అందించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన డా. భువనగిరి సత్య సింధుజకు “ఇంటర్నేషనల్ ఐకానిక్ స్టార్ అవార్డు” లభించింది. సిద్ధ వైద్య పద్ధతుల్లో ఆమెకున్న అపారమైన పరిజ్ఞానం, నిస్వార్థ సేవ, ఆయుర్వేదంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆమె కేవలం ఒక వైద్యురాలు మాత్రమే కాకుండా, అనేక మందికి స్ఫూర్తినిచ్చిన ఆదర్శమూర్తి.

Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!

డా. భువనగిరి సత్య సింధుజ స్థాపించిన చక్రసిద్ధ్ హోలిస్టిక్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ కూడా “ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూషనల్ అవార్డు”ను కైవసం చేసుకుంది. సంప్రదాయ సిద్ధ వైద్య పద్ధతులను ఆధునిక పరిశోధనలతో అనుసంధానిస్తూ, ఎలాంటి మందులు, సర్జరీ లేకుండానే అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో ఈ కేంద్రం అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. రోగులకు అందించే సమగ్రమైన, వ్యక్తిగతీకరించిన చికిత్సా విధానాలు, ఆరోగ్య సంరక్షణలో వారు చూపిన నిబద్ధత ఈ అవార్డుకు కారణం. చక్రసిద్ధ్ సెంటర్ హోలిస్టిక్ హీలింగ్ లో ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. ఈ రెండు అవార్డులను మే 24న సింగపూర్‌లోని హాలిడే ఇన్‌లో జరిగే ఘనమైన కార్యక్రమంలో TIAF-AWARDS (ది ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫోరమ్) వారు ప్రదానం చేశారు. ఇది డా. భువనగిరి సత్య సింధుజ వ్యక్తిగత విజయానికి, ఆమె కృషికి ప్రతీక మాత్రమే కాకుండా, భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు అంతర్జాతీయంగా లభించిన గొప్ప గుర్తింపు.

Viral : నమ్మలేని నిజాన్ని చెప్పిన AI.. ChatGPTతో భర్త మోసం బట్టబయలు

 

Exit mobile version