NTV Telugu Site icon

17 Years of NTV Journey: ప్రతిక్షణం ప్రజాహితం.. ఎన్టీవీ 17 ఏళ్ల ప్రయాణం..

Ntv

Ntv

17 Years of NTV Journey: అతి తక్కువ కాలంలో మీడియా రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అంటే అది ఆషామాషీ కాదు.. కానీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది ఎన్టీవీ.. మాట చెప్పడం.. మాట ఇవ్వడం చాలా సులువు. కానీ, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. దానికి కట్టుబడి ఉండడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు.. అంతకు మించి కష్ట నష్టాలు.. అయినా.. ప్రతిక్షణం -ప్రజాహితం అంటూ సమాజం ముందుకు వచ్చిన ఎన్టీవీ ఆ బాటలోనే ఇన్నాళ్లుగా.. ఇన్నేళ్లుగా.. పయనించడం అంటే అది మామూలు విషయం కాదన్నది జగమెరిగిన సత్యం. సమాజానికి ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలిచే జర్నలిజం విలువల్ని కాపాడడాన్ని సవాల్‌గా స్వీకరిస్తూ.. ఆ సమాజ శ్రేయస్సుకు కంకణం కట్టుకుని ప్రజాపక్షాన వెన్నుదన్నుగా నిలిచి.. ఆ ప్రస్థానంలో 17 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు ఎలా సాగుతున్నామన్నది.. ఇవాళ్టి ఛైర్మన్స్‌ డెస్క్‌లో కళ్లకు కట్టినట్టు చూద్దాం.

ఒక న్యూస్‌ ఛానల్‌ స్థాపించడమనేది సాధారణ విషయం కాదు. ఒక వేళ పెట్టినా… దానిని నడపడం అనేది ఉరకలెత్తే నదికి ఎదురీతే..! ఇలాంటి సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ఎలా నడపాలి? ఏం ప్రసారం చేయాలి? జనానికి ఏది అవసరం? ప్రజలు అసలు ఏం చూస్తారు? పైన చెప్పినవన్నీ స్పష్టంగా సమాధానం తెలియాల్సిన ప్రశ్నలు
ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే.. ఎన్టీవీకి పునాది రాయి వేసే సమయంలో వీటిపై ఎంతో కసరత్తు చేశాం. అన్ని విధాలా ఆలోచించగా అంతిమంగా మస్తిష్కంలోంచి వచ్చిన మెరుపు ఆలోచనే ప్రతిక్షణం ప్రజాహితం.. ఈ 17 ఏళ్ల ప్రయాణమంతా ఇదే మాటగా.. ఇదే శ్వాసగా సాగిందని… సాగించామని సగర్వంగా చెప్పుకుంటాము.. పుబ్బలో పుట్టి మఖ కలవడం లాంటివెన్నో చూశాం. కానీ ఒక సంస్థ పదిహేడేళ్ల పాటు ఒకే కమిట్‌మెంట్‌తో ప్రజా క్షేత్రంలో ముందుకు సాగడం చాలా చాలా అరుదైన విషయం. దానికి నిలువెత్తు నిదర్శనం జనం గుండె చప్పుడుగా మారిన ఎన్టీవీ. ఇక్కడ గట్టిగా మరో విషయం చెప్పాలి. అదేంటంటే.. ఎన్టీవీ రాక ముందు… న్యూస్‌ ఛానళ్లకు సంచలనమే పనిగా ఉండేది. గట్టిగా దగ్గినా, తుమ్మినా.. స్క్రీన్‌ మీద మసిపూసి మారేడుకాయ చేసి నాలుగు బ్రేకింగ్స్‌ వేస్తే జనం టీవీలకు అతుక్కుపోతారు అనుకునేవాళ్లు. కానీ జనాలకు కావాల్సింది అదికాదని.. సీరియస్‌ అంశాలతో పాటు రాజకీయ, ఆర్ధిక అంశాలను మెచ్చేలా తెరపై కనిపిస్తే ఖచ్చితంగా చూస్తారని ఎన్టీవీ నూటికి నూరుపాళ్లు రుజువు చేసింది. రాజకీయ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కూడా ఒక ఛానల్‌ను సక్సెస్‌ చెయ్యవచ్చన్నది ఎన్టీవీ విషయంలో రుజువైంది. అలాగే జనాల వ్యూయర్‌ షిప్‌ పాటర్న్‌ని సమూలంగా మార్చేసింది. తెలుగు సమాజాన్ని రాజకీయ వార్తా తరంగిణి వైపు మళ్లించింది.

ప్రతిరోజూ ప్రైమ్‌ టైమ్‌లో వచ్చే స్టోరీ బోర్డ్‌లో రాజకీయ అంశాల విశ్లేషణలు, చైర్మన్స్‌ డెస్క్‌, స్పెషల్‌ ఫోకస్‌లతో వ్యూయర్స్‌లో విశ్లేషణాత్మక భావానికి పదును పెట్టడంతో ఎన్టీవీ సఫలమైంది. ఓవైపు బ్రేకింగ్‌ న్యూస్‌లు, ఇంపార్టెంట్‌ న్యూస్‌ లైవ్‌లతో అనుక్షణం పరుగులు పెడుతూ.. కాలంతో పోటీ పడుతూ వేగంగా వార్తలు ఇవ్వడమే కాదు.. లైవ్‌లతో అనుక్షణం పరుగులు పెడుతూ వేగంగా వార్తలు ఇవ్వటమే కాదు… వాటిని లోతుగా విశ్లేషిస్తూ.. జనంముందుకు తీసుకురావటంలో ఎన్టీవీ సఫలమైంది. ఏదో సెన్సేషన్‌తో బులెటిన్లు నింపితే చాలనుకునే టైమ్‌ నడుస్తోంది. అసలు సీరియస్‌ వార్తలు ఇస్తూ న్యూస్‌ బులెటిన్‌ నడిపితే ఎవరు చూస్తారు? ఎవరు వింటారు అన్నట్టు ఉండేది. కానీ సరైన పరిశోధనతో, లోతైన విశ్లేషణలతో కార్యక్రమాలు ప్రసారం చేస్తే జనం తప్పకుండా చూస్తారనే దృక్పథాన్ని నిజం చేసి చూపించింది ఎన్టీవీ. అందులో భాగంగానే పొలిటికల్‌ న్యూస్‌ కి ఇంపార్టెన్స్‌ పెంచాం. తెలుగు నాట రాజకీయ వార్తలంటే ఎన్టీవీ అనేంతలా ఎదిగాం. అలాగని బ్రేకింగ్ న్యూస్‌ల వాడి, వేగంలో ఏనాడు వెనకబడ్డామన్న మాటే లేదు. ఒక్క తెలుగు ఛానళ్లలోనే కాదు.. చాలా జాతీయ ఛానెళ్ల కంటే వేగంగా ఎన్టీవీ వార్తలు ఇవ్వగలదని రుజువు చేసుకున్నాం. ఇదొక్కటే కాదు.. వార్తకు విశ్వసనీయత, పారదర్శకత కల్పించటం కూడా ఎన్టీవీ తొలి రోజు నుంచీ చేస్తూ వస్తోంది. ఎన్టీవీ 17 ఏళ్ల ప్రయాణమంతా.. ఆ ప్రయత్నమే.. టాగ్ లైన్ లో చెప్పినది…ప్రసారాల్లో కనిపించాలి.. ప్రతి వార్తకీ ప్రజలే కేంద్రబిందువు కావాలి.. ప్రతి కార్యక్రమానికీ ప్రజాహితమే లక్ష్యం కావాలి.. జనం అభిలాష, ఆకాంక్షలకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలి.. జనాభిప్రాయానికి ఎన్టీవీ నిలువుటద్దం అవ్వాలి.. అడుగడుగునా ఇదే ఆశయం.. చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ ఇదే ప్రామాణికం..

ఎన్టీవీ 17 ఏళ్ల ప్రయాణంపై చైర్మన్‌ డెస్క్‌ పూర్తి కథనం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments