Site icon NTV Telugu

Delhi: కేంద్ర పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం

Animas

Animas

దేశంలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న మాట కులగణన. ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే విపక్ష పార్టీలు కూడా కులగణన చేపట్టాలని ప్రభుత్వాలను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే మనుషులనే కాదు.. పశువులను కూడా లెక్కించేందుకు కేంద్రం సిద్ధపడింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల మాదిరిగానే ఈ పశుగణన చేపట్టాలని డిసైడ్ అయింది. ఈ పశుగణనను సెప్టెంబర్‌-డిసెంబర్‌ నెలల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మొబైల్‌ టెక్నాలజీ వినియోగంతో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

గురువారం పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ అధ్యక్షతన రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు, సాంకేతిక కమిటీ సభ్యులతో మంత్రిత్వ శాఖ సెన్సిటైజేషన్ సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో 21వ పశుగణనను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌ చేపట్టనున్నారు. పలు జాతులకు చెందిన పెంపుడు జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులు వయసు, లింగం తదితర వివరాలను సేకరించి డిజిటలైజేషన్‌ చేస్తారు. దేశంలో మొత్తం పశుసంపదపై గణాంకాలు సేకరించడం ద్వారా పశుసంవర్ధక శాఖలో పలు కార్యక్రమాల అమలుకు విధాన రూపకల్పనలో ఇది దోహదపడనుంది.

Exit mobile version