రైతులకు ఊరట కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు గానూ 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 సీజన్ కు ఖరీఫ్ పంటల ఎంఎస్‌పీ ఆమోదించబడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.100 పెంచగా… దీంతో క్వింటాలు వరి రూ.2040కి చేరనుంది. 2021-22 వరి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.1940గా ఉంది.
Guinnis Record: ఏకధాటిగా పొడవైన రోడ్డు నిర్మాణం.. గిన్నిస్ బుక్‌లోకి భారత్
ఇందులో కందులపై క్వింటాల్‌కు మద్దతు ధర రూ.300, పెసర్లపై క్వింటాల్‌కు రూ.400, పొద్దుతిరుగుడుపై క్వింటాల్‌కు రూ.385, సోయాబీన్ క్వింటాల్‌కు రూ.300, నువ్వులపై క్వింటాల్‌కు రూ.523 పెంచినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఖరీఫ్, రబీ సీజన్లో ఎరువుల అవసరాలను తీర్చడానికి భారతదేశంలో తగినంత యూరియా నిల్వ ఉన్నాయని అన్నారు. డిసెంబర్ వరకు దానిని దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న ఆరు నెలల్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. దేశంలో తగినంత యూరియా అందుబాటులో ఉంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా డిసెంబర్ వరకు యూరియా నిల్వ ఉంది. డిసెంబర్ వరకు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి వెల్లడించారు.
పెంచిన తర్వాత
ధరల వివరాలు(క్వింటాలుకు)
———————-
వరి రూ.2040
వరి ఏ గ్రేడ్ రూ.2060
జొన్న రూ.2970 ,
ఏ గ్రేడ్ రూ. 2990
సజ్జలు : రూ. 2350
రాగి: రూ.3578
మొక్క జొన్న: రూ.1962
కందిపప్పు : రూ. 6600
పెసరపప్పు : రూ. 7755
మినపప్పు : రూ. 6600
వేరు శనగ : రూ. 5850
ప్రొద్దుతిరుగుడు : రూ. 6400
సోయాబీన్ : రూ. 4300
నువ్వులు : రూ. 7830
పత్తి : రూ. 6080
పత్తి పొడవు రకం : రూ.6380
నైగర్ సీడ్ : రూ. 7287.