NTV Telugu Site icon

FM Radio Channels: ఎఫ్ఎం రేడియో ఛానెళ్లకు కేంద్రం హెచ్చరికలు.. ఎందుకంటే?

Fm Radio Channels

Fm Radio Channels

FM Radio Channels: మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్లు, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలు ప్లే చేయడం లేదా కంటెంట్‌ను ప్రసారం చేయకుండా ఎఫ్ఎం రేడియో ఛానెళ్లను కేంద్రం హెచ్చరించింది. ఎఫ్ఎం రేడియో ఛానెళ్లు మైగ్రేషన్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అగ్రిమెంట్ (MGOPA)లో నిర్దేశించిన నిబంధనలు, షరతులను ఖచ్చితంగా పాటించాలని.. ఉల్లంఘించి కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షార్హమని వెల్లడించింది.

UN Security Council: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్

కొన్ని ఎఫ్‌ఎం ఛానెల్‌లు మద్యం, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలను ప్లే చేస్తున్నాయని లేదా కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ గుర్తించిన తర్వాత ఈ హెచ్చరిక జారీ చేయబడింది. ఇలాంటి కంటెంట్ వయస్సులో ఉన్న పిల్లలను ప్రభావితం చేసి తుపాకీ సంస్కృతికి దారితీస్తుందని పంజాబ్, హర్యానా హైకోర్టు సూచించిన న్యాయపరమైన గమనిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అటువంటి కంటెంట్ ఎయిర్‌ ప్రోగ్రామ్ కోడ్‌ను ఉల్లంఘిస్తోందని.. అనుమతిని నిలిపివేయడం, ప్రసార నిషేధం కోసం ఆంక్షలు విధించే హక్కు కేంద్రానికి ఉందని పేర్కొంది.