Site icon NTV Telugu

Kishan Reddy: సరదాగా తిరుగుతూ.. మోండామార్కెట్లో కేంద్రమంత్రి షాపింగ్

Kishan Reddy (4)

Kishan Reddy (4)

ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక సందడి బీజేపీ నేతల్ని టెన్షన్ పెడుతోంది. రాష్ట్రస్థాయి నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా మునుగోడుకు వస్తున్నారు. ఈనెల 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మునుగోడుకి రానున్నారు. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోండా మార్కెట్లో సందడి చేశారు. ఆయన కేంద్ర మంత్రి అయినా సాదాసీదాగా తిరిగేశారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో తన వాహనం దిగి నేరుగా మార్కెట్ లో షాపింగ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Read Also: Like Share Subscribe: అక్క సినిమా కంటే ముందే వస్తున్న చెల్లి సినిమా!

తన అడ్డా సికింద్రాబాద్ లో మోండా మార్కెట్ దీపావళి పండుగ వేళ సందడిగా వుంటుంది. ఈ బిజీ మార్కెట్ ప్రాంతంలో షాపింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రోజ్ గార్ మేళా కార్యక్రమం అనంతరం ఆయన మోండా మార్కెట్ లో దీపావళి ని పురస్కరించుకుని రకరకాల డిజైన్లు వున్న ప్రమిదలతో పాటు బొమ్మల కొలువులను పరిశీలించారు. తమ ఇంట్లోకి అవసరమయిన వాటిని షాపింగ్ చేశారు.

స్వీట్ హౌజ్ లలో స్వీట్ల ను పరిశీలించడంతో పాటు నేరుగా కొనుగోళ్ళు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మోండా మార్కెట్ దీపావళి షాపింగ్ సామాగ్రికి ఫేమస్.. ఒక్కసారిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి వచ్చి అక్కడ షాపింగ్ చేయడంతో వ్యాపారస్తులు అవాక్కయ్యారు. వ్యాపారులను, అక్కడి స్థానికులను పలకరించారు. అందరికీ ముందస్తుగానే దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ షాపింగ్ ఫోటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్లో షేర్ చేశారు.

Read Also: Janasena Party: విశాఖ జైలు నుంచి జనసేన నేతల విడుదల

Exit mobile version