Site icon NTV Telugu

Chandra Sekhar Pemmasani: ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవు!

Chandra Sekhar Pemmasani

Chandra Sekhar Pemmasani

ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని.. ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే తన మనసు పులకించిందన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గండికోటను మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదు అని పెమ్మసాని విమర్శించారు. నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గండికోటను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి పెమ్మసాని సందర్శించారు.

Also Read: Yogandhra 2025: ‘పోలీసు యోగాంధ్ర’ కార్య‌క్ర‌మం.. పాల్గొన్న సీఎస్‌ విజయానంద్‌!

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… ‘ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశా. ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే నా మనసు పులకించింది. అద్భుతమైన పెన్నా లోయ, అందమైన గండికోటను 78 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నాం. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మాధవరాయ స్వామి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టను త్వరలో చేపడతాం. సొంత జిల్లా వాసి వైఎస్ జగన్. ముఖ్యమంత్రిగా పనిచేసినా గండికోటను ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదు’ అని అన్నారు.

Exit mobile version