ఆపరేషన్ కగార్ పేరుతో కర్రె గుట్టల్లో భద్రతా బలగాలు మావోలను జల్లెడ పడుతూ ఏరివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ ఆపరేషన్ కగార్ ను ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పౌరుల ప్రాణాలు తీస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనం నేని సాంభశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” ఆపరేషన్ కగార్ తో దేశ పౌరులను పిట్టల్ని కాల్చి నట్టుగా కాల్చి చంపుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలు మార్చుకోవాలి.. సాయుధ పోరాట కాలంలో కూడా ఇంత దాష్టీకం జరగలేదు..
Also Read:MISS WORLD-2025: మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ఫాసిస్ట్ పన్నాగంతో మోడీ, షా లు ముందుకు వెళ్తున్నారు.. ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, కేంద్ర బలగాలు కలిసి ఆపరేషన్ చేస్తున్నారు.. దోపిడీలు చేస్తున్నారా, అవినీతి చేస్తున్నారా..? అడవుల్లో ఉన్న వనరులను దోచుకుంటున్నారా? కార్పొరేట్ శక్తులకు ఎదురు నిలవడం నేరం అవుతుందా..? ఏం తప్పు చేశారని వరవరరావు, సాయిబాబా లాంటి వారిని అరెస్ట్ చేశారు.. మోదీని వరవర రావు హత్య చేస్తారా..? మావోయిస్టులు కాదు అన్ని కమ్యూనిస్టు పార్టీలు మా చుట్టాలే..
Also Read:CM Revanth Reddy Vijayawada Visit: రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. విషయం ఇదే..!
చంపే హక్కు ఎవరిచ్చారు..? చర్చలకు వస్తామంటే కూడా చంపడం సరైనా విధానం కాదు.. చర్చలకు రావద్దా..? దేశంలో ముస్లింలు ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండొద్దు, ప్రశ్నించే వారు ఉండొద్దు అనే సిద్ధాంతం బీజేపీది.. ఎవరు దుర్మార్గులు ? గోద్రా అల్లర్లో జైలుకు వెళ్ళి వచ్చిన అమిత్ షా దుర్మార్గుడా..? లేక ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులా..? కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.. ఈ అంశాన్ని న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవాలి.. కేంద్ర బలగాలు సృష్టిస్తున్న ధమనఖాండను వెనక్కు తీసుకునే విధంగా న్యాయస్థానాలు ఆలోచన చేయాలి.. మా సింగిల్ ఎజెండా ఒక్కటే మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలి’ అని కూనంనేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
