NTV Telugu Site icon

Rice Export: ఆ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Rice

Rice

Rice Export To Singapore: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూలై 20న బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవోల్బణాన్ని తగ్గించడం కోసం ఆహార నిల్వల పెంపుకోసమే ఇలా చేశామని అప్పట్లో మోదీ సర్కారు చెప్పుకొచ్చింది. అన్నపూర్ణగా భారతదేశం ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం కొరత  ఏర్పడి డిమాండ్ భారీగా పెరిగింది. ఎగుమతులు ఆపేయడంతో విదేశాల్లో ఉంటున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రపంచ బియ్యం రవాణాలో భారతదేశ ఎగుమతులు 40% కంటే ఎక్కువ. 2021-22లో భారత్ దాదాపు 22 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది భారత్. తాజాగా ఉప్పుడు(పారాబాయిల్డ్‌) బియ్యం ఎగుమతులపై కూడా 20% పన్ను విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా బాస్మతి బియ్యం ఎగుమతులపైన కూడా ఆంక్షలు విధించింది. ఇక నూక బియ్యం ఎగుమతులపై గత ఏడాదే కేంద్రం నిషేధం విధించిందిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్‌.. ఇప్పుడు అన్ని రకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు అయ్యింది.  అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి భారతీయులు అధికంగా ఉన్న దేశాలకు కూడా ఎగుమతులు ఆపేసిన భారతదేశం సింగపూర్ కు బియ్యం ఎగుమతి చేసేందుకు మాత్రం పచ్చ జెండా ఊపింది. సింగపూర్ కు సరఫరా చేయడానికే  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి దానితో ఉన్న ఎన్నో ఏళ్ల స్నేహ బంధమే కారణమని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా సింగపూర్ తో భారత్ కు మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Google Flights: గూగుల్ కొత్త ఫీచర్.. తక్కువ ధరకే విమాన టికెట్లు

ఇక సింగపూర్ కు బియ్యం ఎగుమతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. భారత్, సింగపూర్‌ల మధ్య సన్నిహిత,  వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.  “భాగస్వామ్య ఆసక్తులు, సన్నిహిత ఆర్థిక సంబంధాలు ఉన్న కారణంగానే సింగర్ పూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. . దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఇవి త్వరలోనే వెలువడనున్నాయి. అయితే సింగపూర్ కు ఎగుమతి చేసే బియ్యం పరిమాణంపై మాత్రం అధికారిక సమాచారం లేదు