Site icon NTV Telugu

BRS Party: బీఆర్ఎస్‌కు బిగ్ రిలీఫ్‌.. ఈసీ నిర్ణయంతో..!

Brs

Brs

BRS Party: కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చే న్యూస్‌ చెప్పింది.. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్‌ను కొన్ని గుర్తులు దెబ్బకొట్టాయి.. కారును పోలిన గుర్తులు బ్యాలెట్‌లో ఉండడంతో.. చెప్పుకోదగిన స్థాయిలో వాటికి ఓట్లు వచ్చాయి.. అదే సమయంలో బీఆర్ఎస్‌కు తగ్గిపోయాయి.. దాని మూలంగానే కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయి.. అయితే, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు ఆ పార్టీ నేతలు.. ఇన్నాళ్లకు వారికి ఈసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.. ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Read Also: Malakpet Crime: మొండెం లేని తల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు.. రంగంలోకి 8 బృందాలు

ఎన్నికల గుర్తు జాబితా నుంచి బీఆర్‌ఎస్‌ ఆక్షేపించిన గుర్తులను తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎవరికీ కేటాయించకూడదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. ఈసీ తాజా నిర్ణయం ప్రకారం.. ఆటోరిక్షా, హ్యాట్‌ (టోపీ), ఇస్త్రీపెట్టె, ట్రక్‌ గుర్తులు ఇకపై తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ కేటాయించారు.. ఆ గుర్తులను నిషేధిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది ఈసీ.. ఇదే సమయంలో మొత్తం 193 గుర్తులను జాబితాలో పొందుపరిచింది ఎన్నికల కమిషన్‌.. ఇక, తెలంగాణలో నాలుగు పార్టీలు ఈసీ గుర్తించింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీకి కారు గుర్తు, ఎంఐఎంఐఎంకి గాలిపటం, తెలుగుదేశం పార్టీకి సైకిల్‌, వైఎస్సార్సీపీకి సీలింగ్‌ ఫ్యాను గుర్తులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. మరోవైపు.. జనసేన పార్టీకి షాకిచ్చింది ఈసీ.. ఏపీలో రెండు పార్టీలకు మాత్రమే ఎన్నికల సంఘం గుర్తించింది. వైఎస్సాసీపీకి సీలింగ్‌ ఫ్యాన్‌, తెలుగుదేశం పార్టీకి సైకిల్‌ గుర్తు ఖరారు చేసింది.. కానీ, జనసేన పార్టీ త గుర్తుగా ప్రచారం చేసుకుంటున్న ‘గాజు గ్లాసు’ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది.

మొత్తంగా.. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం శుభవార్త చెప్పినట్టు అయ్యింది.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. ఉప ఎన్నికల్లోనూ కారును పోలిన గుర్తులు బీఆర్ఎస్‌కు షాకిచ్చాయి.. కొన్ని నియోజకవర్గాల్లో వేలల్లో ఆ గుర్తులకు ఓట్లు పడ్డాయి.. ఆ గుర్తులకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటమిపాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో.. దిద్దుబాటు చర్యలకు పూనుకున్న బీఆర్ఎస్‌ పార్టీ.. పలు మార్లు ఈ వ్యహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.. ఆ సింబల్స్‌తో తాము నష్టపోయామని విన్నవించాయి.. బీఆర్ఎస్‌ విజ్ఞప్తిని మన్నించి.. తాజాగా విడుదల చేసిన సింబల్స్‌లో అభ్యంతరం ఉన్న ఆ సింబల్స్‌ను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం.

Exit mobile version