NTV Telugu Site icon

Election Commission: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై వివరణ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

Cec

Cec

Election Commission: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకున్నా.. సదరు బ్యాలెట్ ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏపై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది.

Read Also: Kakani Govardhan Reddy: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించింది..

పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సీపై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించ రాదని స్పష్టం చేసింది. ఫాం 13 ఏలో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించవచ్చని పేర్కొంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.