NTV Telugu Site icon

RBI: రూ. 100, రూ. 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

Rbi

Rbi

బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 100, రూ. 200 నోట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కొత్తగా విడుదల చేయనున్న నోట్ల డిజైన్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ఆర్బీఐ గతంలో జారీ చేసిన రూ.100, రూ.200 నోట్లన్నీ చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయని తెలిపింది.

Also Read:Narendra Modi : భోజ్ పురిలో మాట్లాడిన మోడీ.. ఆ వంటకం గురించి స్పెషల్ కామెంట్

పొడిగించిన పదవీకాలం పూర్తయిన తర్వాత శక్తికాంత దాస్ పదవీ విరమణ చేసిన తర్వాత మల్హోత్రా డిసెంబర్ 2024లో RBI గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 26వ గవర్నర్ అయ్యారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన IAS అధికారి అయిన మల్హోత్రా పదవీకాలం మూడు సంవత్సరాలు. గతంలో, ఆయన రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఆర్‌బీఐ మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌లో రూ.50 కొత్త నోట్లను జారీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది.