టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’.. గీతాగోవిందం ఫెమ్ పరుశురాం దర్శకత్వలో తెరకేక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా రన్‌టైమ్, సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. దీని పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి..
ఈ సినిమా ను తెలుగుతో పాటుగా తమిళం, హిందీలో కూడా విడుదల కాబోతుంది. ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ ఏం లేకపోవడంతో ఫ్యామిలీ స్టార్‌కి బాగానే కలిసొచ్చేలా కనిపిస్తుంది.. ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. సినిమా పై అంచనాలను పెంచేస్తుంది.. విజయ్ ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఇక సమ్మర్ కు రిలీజ్ అవ్వబోతున్న సినిమాగా రాబోతున్న ఫ్యామిలీ స్టార్ సూపర్ హిట్ అందుకొనే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..
తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతుంది.. సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది.. సినిమా బాగుందనే టాక్ ను అందుకుంది.. అలాగే యూ/ ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.. ఇక ఈ సినిమా రన్ టైం విషయానికొస్తే.. 2గంటల 40 నిముషాలు ఉంది.. హిందీ, మలయాళంలో ఈ సినిమా రెండు వారాల తర్వాత రిలీజ్ కాబోతుంది.. తమిళనాడులో 250 థియేటర్లలో సినిమాను విడుదల చెయ్యనున్నారు..ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఫ్యామిలీ స్టార్‌కి కాస్త పోటీ ఉంది. అయినప్పటికీ సమ్మర్ సీజన్ కావడంతో రెండు సినిమాలు జోరు చూపించొచ్చు.. ఖుషి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న విజయ్, హాయ్ నాన్న సినిమాతో మృణాల్ కూడా సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి .