ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగిపోతుంది. అందుకు అనుగుణంగా ప్రజలు సైతం తమ జీవనశైలీని మార్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. వాటికి సరిగ్గా సిగ్నల్ కోసం ఏర్పాటు చేసే సెల్ ఫోన్ టవర్స్.. ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తుంటారు. అయితే, సెల్ ఫోన్ టవర్స్ నుంచి ప్రమాదకర రేడియేషన్ వెలువడుతుందని.. పరిసర ప్రాంతాల ప్రజల హెల్త్ పై అది ఎఫెక్ట్ చూపిస్తుందని అనేక నివేదికలు వచ్చాయి. ఇలాంటి కారణాలతో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటును స్థానికులు అడ్డుకున్న ఘటనలను మనం చాలానే చూశాం. కానీ తాజాగా జరిగిన ఒక ఘటన వెరైటీగా ఉంది.
Read Also: CM KCR: మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ఫోకస్.. వచ్చే నెల 1న పర్యటన
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా లచ్కెరా గ్రామస్తులు తమ విలేజ్ లో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటును అడ్డుకున్నారు. తమకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అక్కర లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఊరిలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటుకు ఏ కంపెనీ వచ్చినా అడ్డుకుంటామని క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక స్వార్ధం లేదు.. తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే తాపత్రయం లేదు.. లచ్కెరా గ్రామంలోకి వలస వచ్చే పక్షుల గురించి మాత్రమే వారు ఆలోచించారు.
Read Also: Osmania University: సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు.. ఓయూలో విద్యార్థుల ఆందోళన..
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చైనా, థాయ్ లాండ్, బర్మా, ఇండోనేషియా నుంచి ఈ గ్రామానికి వందలాది ఏషియన్ ఓపెన్‌బిల్ జాతి కొంగలు వలస వస్తుంటాయి. లచ్కెరా గ్రామంలోని చెట్లపై ఈ కొంగలు గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఈక్రమంలో తమ ఊరిలోని చెరువులో ఉన్న నీటి పాములు, కప్పలు, కీటకాలను అవి తింటాయి. అవి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని.. తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగ టైం తర్వాత వెళ్లిపోతాయని గ్రామస్థులు చెబుతున్నారు.
Read Also: Seema Haider: 2 రోజులు, 18 గంటల పాటు ప్రశ్నల వర్షం.. విచారణలో సీమా హైదర్ వెల్లడించిన నిజాలు
ఒకవేళ మా ఊళ్లో సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తే ఈ పక్షుల సంతానోత్పత్తి ప్రక్రియకు ప్రమాదం పొంచి ఉందని లచ్కెరా గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ కారణాలతో తమ ఊరిలో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని లచ్కెరా గ్రామ సర్పంచ్ వెల్లడించారు. మా ఊరికి ఇంటర్నెట్ కనెక్షన్ వీక్ గా ఉన్న పర్లేదు.. కానీ మా ఊరిని నమ్ముకొని వలస వచ్చే పక్షుల ప్రాణాలకు ప్రమాదం కలగడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. ఊళ్లో ఎవరైనా వలస పక్షులకు హాని కలిగిస్తే.. వారికి రూ.1,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. మా గ్రామంలో మొబైల్ టవర్ల ఏర్పాటుకు పర్మిషన్ లేదని చెబుతూ తీర్మానం కూడా చేశారు.