NTV Telugu Site icon

Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..

Chief Election Commissioner Rajeev Kumar

Chief Election Commissioner Rajeev Kumar

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం వాడడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఖండించారు. అభ్యర్థులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిపై సత్వర, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల, చట్టాన్ని అమలు చేసే అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు.

READ MORE: CM Chandrababu: ఏలూరు పోలీసులను అభినందించిన ముఖ్యమంత్రి..

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం… రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ పని, కార్యకలాపాలు లేదా ప్రకటనలు చేయొద్దని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థులు వ్యక్తిగత దాడులు లేదా పబ్లిక్ పాత్రలతో సంబంధం లేని విమర్శలకు దూరంగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలలో పాల్గొనే వారందరూ బహిరంగ ప్రసంగాలలో గౌరవప్రదమైన ప్రవర్తన, భాషను గమనించాలని సీఈసీ తెలిపారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి నేతలు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించిన విషయం తెలిసిందే. శివసేన అభ్యర్థి షైన ఎన్‌సిపై శివసేన (యుబిటి) ఎంపి అరవింద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఈసీ నుంచి ఈ ప్రకటన వచ్చింది.

READ MORE:Salman Khan: సల్మాన్‌ కోసం 70 మంది సెక్యూరిటీ.. ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Show comments