Site icon NTV Telugu

CEC: ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది నియామకానికి నో అబ్జెక్షన్

Elections

Elections

CEC: గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది నియామకానికి సీఈసీ నో అబ్జెక్షన్ తెలిపింది. గ్రామ సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధుల అప్పగింతపై సీఈసీ కండీషన్లు పెట్టింది. గ్రామ సచివాలయ సిబ్బందికి కీలకమైన ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని సీఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల వేలికి ఇంకు చుక్కలు పెట్టడం వంటి చిన్న చిన్న బాధ్యతలనే అప్పగించాలని, ముఖ్యమైన ఎన్నికల పనులేవీ వారికి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

Read Also: Harom Hara: ఏముందిరా బాబు సాంగ్ .. అస్సలు పోవడం లేదు మైండ్ లో నుంచి

బీఎల్వోలుగా నియమించిన సచివాలయ సిబ్బందిని పోలింగ్‌ విధుల్లోకి తీసుకోవద్దని.. వారికి పోలింగ్ రోజు ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీఈసీ తెలిపింది. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఈసీ ఉత్తర్వులను కలెక్టర్లకు ఏపీ సీఈఓ ఎంకే మీనా పంపారు.

 

Exit mobile version