సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ద్వారా CBSE 10వ, 12వ ఫలితాలు ఇటీవల ప్రకటించారు. అనంతరం రీవాల్యుయేషన్ ప్రక్రియ సైతం ప్రారంభించారు. CBSE 12వ తరగతికి సంబంధించిన రీవాల్యుయేషన్ దరఖాస్తు ప్రక్రియ మే 17న ప్రారంభమై.. మే 21తో ముగిసింది. కాగా, CBSE 10వ తరగతి మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియ మే 20న ప్రారంభమై.. మే 24న ముగిసింది. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియకు వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. దాని ప్రకారం.. CBSE 12 వ తరగతి వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలు మే 30 లోపు ఆశించవచ్చు. అయితే CBSE 10th రీవాల్యుయేషన్ ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. CBSE బోర్డు 12వ తరగతికి చెందిన కొంతమంది విద్యార్థుల రీవాల్యుయేషన్ ఇప్పటికే పూర్తియి..పోర్టల్‌లో నవీకరించబడ్డాయి.
READ MORE: Sandeshkhali Case: తొలి ఛార్జిషీటు దాఖలు.. నిందితులపై హత్యాయత్నం కేసు
కాగా.. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతి ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. సీబీఎస్ఈ పదో తరగతిలో 93.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 47,983 మంది విద్యార్థులకు 95 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. తిరువనంతపురంలో అత్యధికంగా 99.75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు జరిగాయి. కాగా, 12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలే పై చేయి సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 91.52 శాతం మంది అమ్మాయిలు, 85.12 శాతం మంది బాలురు ఉన్నారు. తిరువనంతపురంలో అత్యధికంగా 99.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. విద్యార్థుల్లో అనారోగ్య పోటీతత్వాన్ని లేకుండా చేసేందుకు మెరిట్ జాబితాను సీబీఎస్ఈ ప్రకటించడం లేదన్న విషయం తెలిసిందే.