కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు నేడు అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల ప్రతిభను చాటేలా ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు తెలుస్తోంది.
ఫలితాల వెల్లడి అనంతరం బోర్డు తన అధికారిక వెబ్‌సైట్లలో మార్కుల జాబితాను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రోల్ నంబర్ , ఇతర వివరాలను ఉపయోగించి స్కోరు కార్డులను పొందవచ్చు. కేవలం వెబ్‌సైట్ ద్వారానే కాకుండా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డిజిలాకర్ , ఉమాంగ్ యాప్స్ ద్వారా కూడా మార్కుల మెమోలను డిజిటల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది విద్యార్థులకు పై చదువుల ప్రవేశాల సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు తమ మార్కులపై అసంతృప్తిగా ఉంటే, బోర్డు సూచించిన గడువులోగా రీ-వెరిఫికేషన్ లేదా రీ-ఇవాల్యూషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఫలితాలను ఇలా చూడండి..
1. సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.in లేదా cbse.gov.in సందర్శించండి.
2. హోమ్ పేజీలో కనిపించే ‘Secondary School Examination (Class X) Results 2026’ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ అడ్మిట్ కార్డులో ఉన్న విధంగా రోల్ నంబర్ (Roll Number), స్కూల్ నంబర్ (School No.), మరియు అడ్మిట్ కార్డ్ ఐడీ (Admit Card ID) వివరాలను ఎంటర్ చేయండి.
4. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయండి.
5. మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మార్కులను తనిఖీ చేసుకుని.. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ లేదా పిడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.
