NTV Telugu Site icon

NEET: నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం

Cbi

Cbi

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్‌ నిర్వహణలో అవకతవకలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే యూజీసీ-నెట్‌ లీక్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ.. విచారణను వేగవంతం చేసింది.

ఇది కూడా చదవండి: AP Speaker: దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఇదిలా ఉంటే నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం శనివారం కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా విద్యాశాఖకు నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది. ఇక ఆదివారం తాజాగా సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Maoists: మావోయిస్టులు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారా..? ఆపరేషన్‌లో కీలక ఆధారాలు..

ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ వ్యవహారంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో కేంద్రం ముందుగానే దిద్దుబాటు చర్యలను చేపట్టింది. అయినా విపక్ష పార్టీలు సోమవారం ఎలా స్పందిస్తాయో చూడాలి.

ఇది కూడా చదవండి: Bomb Threat : విమానానికి బాంబు బెదిరింపు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు