Site icon NTV Telugu

CBI: డిటైల్ స్టేట్మెంట్ కోసం ఆయేషా తల్లిదండ్రుల వద్దకు సీబీఐ అధికారులు

Cbi

Cbi

CBI: 2007 డిసెంబరు 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఆయేషా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే తాజాగా.. మరోసారి ఈ కేసుపై ఆయేషా తల్లిదండ్రులను విచారించేందుకు సీబీఐ అధికారులు వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో వారిని కలిసిన అధికారులు.. మరొకసారి డిటైల్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే ఆయేషా తల్లిదండ్రులు మాత్రం అందుకు నిరాకరించారు.

Read Also: Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?

ఈ సందర్భంగా ఆయేషా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమకు సిట్ మీద నమ్మకం లేక సీబీఐ విచారణ అడిగామని తెలిపారు. అయితే సీబీఐ విచారణ ప్రారంభమై ఐదు ఏళ్ళు గడుస్తున్న కనీస ఫలితం రాలేదని అధికారుల వద్ద తమ నిరాకరణను వ్యక్తం చేశారు. తమ మత సంప్రదాయం కాకపోయినా న్యాయం జరుగుతుందని రీపోస్ట్ మార్టంకు సహకరించామన్నారు. తమ అమ్మాయి అవశేషాలు తీసుకుపోయిన అధికారులు జాడ లేకుండా పోయారని తండ్రి ఆరోపించారు. సీబీఐ చేస్తున్న విచారణ ఏంటో వాళ్లకే తెలియాలని.. పదిహేను సంవత్సరాలలో ఎంత మందికి స్టేట్ మెంట్ లు ఇవ్వాలి అంటూ సీబీఐ అధికారులను ఆయేషా తల్లిదండ్రులు నిలదీశారు.

Read Also: Nipha Virus: నిపా వైరస్ కేరళలో మాత్రమే విధ్వంసం సృష్టిస్తోంది.. ఎందుకంటే ?

Exit mobile version